నిర్మల్ జిల్లా అడవుల్లో పులి సంచారంతో తీవ్ర భయాందోళన

రిపోర్టర్: విజయ్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లాలోని సుర్జాపూర్ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ ఆఫీసర్ నరేందర్ వెల్లడించారు. ఖానాపూర్, మామడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని, పశువులను మేతకు తీసుకెళ్లవద్దని గ్రామస్తులను, రైతును హెచ్చరించారు. పులి జాడను గుర్తించేందుకు ట్రాకింగ్ ముమ్మరం చేశామని, ట్రాప్ కెమెరాలతో నిఘా ఉంచామని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.