మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి: సర్పంచ్ దీపా నరేందర్ పిలుపు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దీపా నరేందర్ మాట్లాడుతూ అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటికీ సమాజానికి ఎంతో మార్గదర్శకమని, ఆయన చూపిన సన్మార్గంలో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రోళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.