అభిప్రాయభేదాలు సంస్థాగత చర్చల్లో సహజమేనని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

సంస్థాగత చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజమని, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ గత ఏడాది కాలంగా ఫుల్ కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.