ఇంటింటికీ తెలుగుదేశం: 40 రోజుల్లో కోటి ఇళ్లను తాకిన టీడీపీ

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలను నేరుగా సందర్శించి టీడీపీ శ్రేణులు మైలురాయిని అధిగమించాయి. 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ఈ ప్రచారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘనతతో పార్టీ క్యాడర్‌లో నూతనోత్సాహం నెలకొంది.