అద్దంకి యువతకు శుభవార్త: రూ.కోటి యాభై లక్షలతో నూతన ఇండోర్ స్టేడియం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బాపట్ల

అద్దంకి యువత క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రూ.1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక జిమ్ మరియు ఇండోర్ షటిల్ కోర్టుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసినట్లు గొట్టిపాటి రవి కుమార్ - విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే వెల్లడించారు. విద్యార్థులకు క్రీడా సదుపాయాలు మెరుగుపరిచి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తూ అద్దంకి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.