ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు
రిపోర్టర్: నరేష్
స్థలం: తూర్పు గోదావరి
ఆసియా క్రీడలలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చైనాపై ఒకటి సున్నా తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. పందొమ్మిది వందల ఎనిమిది రెండు తర్వాత నలభై నాలుగు ఏళ్ల నిరీక్షణకు తెరదించి మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారని, ఈ అద్భుత విజయం ద్వారా రాబోయే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆమె ప్రశంసించారు.