దీపావళి గిఫ్ట్ పేరుతో భారీ మోసం: ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
దీపావళి పండగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారని అనంతపురం పోలీసులు తెలిపారు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ పేరుతో ప్రతి ఒక్కరికీ రెండు వేల రూపాయలు ఉచితంగా ఇస్తామంటూ నకిలీ సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఆ అనుమానాస్పద లింక్‌లను తెరిస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.