మేడిగడ్డ పిల్లర్ను కాంగ్రెస్ ప్రభుత్వమే పేల్చిందంటూ బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: ఆర్మూర్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ను కాంగ్రెస్ ప్రభుత్వమే పేల్చివేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం వెన్నుపోట్లతో నిండిపోయిందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఎస్సారెస్పీకి వెంటనే నీటిని విడుదల చేయాలని, లేదంటే భారీ ఉద్యమం చేపడతామని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.