జన్నారంలో నిధులున్నా నత్తనడకన సాగుతున్న వంతెనల పనులతో తీవ్ర ఇబ్బందులు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాల శివారులలో ఉన్న వాగులపై ప్రతిపాదిత వంతెనల నిర్మాణాలు పూర్తికాకపోవడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మల్యాల, జన్నారం, లోతరే వాగులపై వంతెనల కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు ఆలస్యం అవుతున్నాయి. వానాకాలంలో వరదలతో రాకపోకలు నిలిచిపోతున్నాయని, ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే వర్షాకాలంలోపు వంతెనలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.