హానికర ఉత్పత్తులను ప్రమోట్ చేయవద్దని సినీ ప్రముఖులకు రాష్ట్రపతి ముర్ము హితవు

రిపోర్టర్: సునీల్ స్థలం: Gujarat

గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రముఖ సినీ నటులు ప్రకటనల రూపంలో మద్దతు తెలపకూడదని ఆమె గట్టిగా కోరారు. యువతపై సెలబ్రిటీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, నిజమైన స్టార్ చీకటిని కాకుండా వెలుగును పంచాలని ముర్ము హితవు పలికారు.