విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

ప్రత్తిపాడు గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ నాలుగు వందల మిశ్రమ గ్రాముల మాత్రలను స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.