చిన్న శ్రీను రాజీనామాపై బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

వైకాపాకు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజీనామా చేయడంపై సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గరివిడిలో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తిని నమ్మి బాధ్యతలు అప్పగించడం తన తప్పు అని, అతనికి అభివృద్ధి కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువయ్యాయని వాపోయారు. గతం మరిచిపోయి నేటి నుంచి కొత్త శకం ప్రారంభిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.