'భాషే బంధానికి మూలం..': అమెరికాలో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

రిపోర్టర్: అశోక్ స్థలం: అమెరికా

ఉత్తర అమెరికాలో తెలుగు కుటుంబాల చిన్నారులకు తెలుగు నేర్పించే లక్ష్యంతో తానా పాఠశాల 2026-27 సంవత్సరానికి సంబంధించిన తరగతులను ప్రారంభించింది. పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించగా, తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, కోశాధికారి రాజా కసుకుర్తి పాల్గొని సందేశం అందించారు. ఐదేళ్ల పైబడిన పిల్లలకు పలుకు, అడుగు, పరుగు, వెలుగు విభాగాలలో బొమ్మలతో సులభపద్ధతిలో తెలుగు నేర్పిస్తూ, మాతృభాషను భావితరాలకు అందించడమే ఈ వేదిక ప్రధాన ఆశయమని నిర్వాహకులు తెలిపారు.