బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ శర్మ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ నటి సారా అర్జున్
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ యంగ్ నటి సారా అర్జున్ కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. ధురంధర్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్, ప్రముఖ దర్శకుడు మనీష్ శర్మ తెరకెక్కించనున్న తర్వాతి చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అంబరీష్ వర్మ హీరోగా కనిపించనుండగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.