కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిపై సీబీఐ అధికారుల ప్రశ్నల వర్షం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

పోలీస్ స్టేషన్లో సాయికృష్ణకు చికిత్స అందించేందుకు ఆర్ఎంపీని ఎందుకు పిలిపించారంటూ కృష్ణలంక ఠాణా సిబ్బందిపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ కస్టడీ మృతి కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ, సీఎఫ్ఎస్ఎల్ నిపుణుల బృందం స్టేషన్లో నిశితంగా పరిశీలించి నమూనాలు సేకరించింది. ఈ కేసులో కీలక ఆధారాల కోసం అధికారులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.