డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ వైఎస్సార్సీపీ అధికారికంగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. స్పోర్ట్స్ కోటాలో టెట్ అర్హత లేని సుమారు 370 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆ పార్టీ మండిపడింది. కష్టపడి చదివే నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఈ అక్రమాలను ప్రశ్నిస్తే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది.