విద్యుత్తు తీగలు తగిలి పొలంలో మహిళ దుర్మరణం
రిపోర్టర్: సురేష్
స్థలం: పార్వతీపురం
పార్వతీపురం మండలంలో విద్యుదాఘాతంతో బి.జానకమ్మ అనే మహిళ దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. నడిమి గదబవలస సమీప పొలంలో తుపానుకు వాలిన విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అటువైపు వెళ్లిన జానకమ్మకు ప్రమాదవశాత్తు తీగలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.