ఢిల్లీలో శాంతిభద్రతల వైఫల్యం: నేహా బోరా తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
సాధారణ పౌరులను కఠిన నేరస్థుల మాదిరిగా పోలీసులు అణచివేస్తున్నారని ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తీవ్రంగా ఆరోపించారు. అక్రమ నిర్బంధాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రిపూట నిర్బంధించి మరుసటి రోజు విడుదల చేయడం చట్టవిరుద్ధమని, సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు సరికాదని ఆమె స్పష్టం చేశారు.