హైదరాబాద్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వేగవంతమైన భూసేకరణ
రిపోర్టర్: రాము
స్థలం: రంగారెడ్డి
తెలంగాణలో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడలో ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం భారీ భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుంది.