మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలి
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై చెలరేగిన వివాదంపై వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లతో పోస్టులను అమ్ముకోవడం వంటి అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ నియామక ప్రక్రియపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, సీఎం చంద్రబాబు దమ్ముంటే దీనికి అంగీకరించాలని సవాల్ విసిరారు.