నాతవరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటే నడుస్తున్న యువత
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాతవరం
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన ప్రజా రక్షక కార్యక్రమాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నాయకత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పల్లెల్లో ప్రజలు ఆయన వెంటే నిలబడుతున్నట్లు స్థానిక శ్రేణులు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును బహిరంగంగా చాటుకున్నారు.