విశాఖలో రూ. డెబ్బై లక్షలు బంగారం దోపిడీ

రిపోర్టర్: అశోక్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నం ద్వారకానగర్లో భారీ మోసం వెలుగు చూసింది. కరెన్సీని డాలర్లుగా మారుస్తామంటూ ఆన్లైన్లో నమ్మించిన కేటుగాళ్లు టెక్కలికి చెందిన రమేష్ వద్ద నుంచి సుమారు డెబ్బై లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, సుమారు ఇరవై మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.