ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు: కమలం వైపే విద్యావేత్తల చూపు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గ కార్యాలయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కోరారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్తల మద్దతు బీజేపీకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు.