చెరువులో జీపు నిలిపి మద్యం తాగి నిద్రపోయిన యువకులు
రిపోర్టర్: సురేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో ఇద్దరు యువకులు చెరువులో థార్ వాహనం నిలిపి మద్యం తాగి నిద్రపోయారు. అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో చెరువులోకి వరదనీరు చేరి నీటిమట్టం పెరిగింది. భయంతో జీపుపైకి ఎక్కి కేకలు వేసిన వారిని స్థానికులు పొక్లెయిన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.