కట్నం వేధింపులతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి నవవధువు ఆత్మహత్య
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మేడ్చల్-మల్కాజిగిరి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీఆర్ఐటీ కళాశాలలో వివాహమైన 18 రోజులకే పల్లవి అనే నవవధువు భర్త అదనపు కట్నం వేధింపులు భరించలేక మూడో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లికి చెందిన పల్లవికి ఆగస్టు 30న చైతన్యపురి కానిస్టేబుల్ బి.శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరుగగా, భర్త వేధింపులతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.