కోల్ మరియు మైనింగ్ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యంతో కోల్ మరియు మైనింగ్ రంగాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో తెలంగాణ ప్రజలతో మమేకమవుతూ ఈ రంగాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.