ఉత్తరప్రదేశ్ లో దారుణం: భార్యను కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన భర్త
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Kannauj
ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా జగత్పూర్ లో భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సోనమ్ అనే మహిళను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన సుఖ్వీర్ సింగ్ అలియాస్ మోను ఇద్దరు పిల్లలతో పరారయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.