యూరియా కోసం లక్కీ డ్రా వినూత్న నిరసన

రిపోర్టర్: శివ స్థలం: రూప్లా తండా, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్లా తండాలో యూరియా కొరతపై యువకులు వినూత్నంగా నిరసన తెలిపారు. గణపతి మండపం వద్ద బంజారా కింగ్స్ యూత్ సభ్యులు రూ.99కి లక్కీ డ్రా టోకెన్ ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి మూడు యూరియా బస్తాలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఎరువుల కోసం రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుంటున్నప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ఈ రూపంలో ఎత్తిచూపారు.