నూట కోట్ల వసూళ్లు సాధించిన తమిళ నటుడు సూరి మండాడి సినిమా

రిపోర్టర్: సతీష్ స్థలం: తమిళనాడు

తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన మండాడి చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వమైన సంచలనం సృష్టిస్తూ వంద కోట్ల మైలురాయిని దాటింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో యువ కథానాయకుడు సుహాస్ ప్రతి నాయకుడిగా నటించగా పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఊహించని స్థాయిలో క్రేజ్ లభించింది.