విజయనగరం వెంకటపద్మ హాస్పిటల్లో నూతన వార్డులను ప్రారంభించిన మంత్రి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విజయనగరం

విజయనగరంలో పునరుద్ధరించిన వెంకటపద్మ హాస్పిటల్లోని నూతన చిల్డ్రన్స్ మరియు ఉమెన్స్ వార్డులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గత ఇరవై సంవత్సరాలుగా వంద పడకలతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తున్న ఈ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. చుట్టుపక్కల ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు.