హైకోర్టు సంచలన ఉత్తర్వులు: భగీరథ్ పోక్సో కేసు కంటెంట్ ప్రసారంపై మధ్యంతర ఆంక్షలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఆంక్షలు విధించిందని అధికారులు తెలిపారు. మార్ఫింగ్ ఫోటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ సహా పలు ఛానళ్లను ప్రతివాదులుగా పేర్కొన్న కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.