రైతు కష్టాలపై సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి నిప్పులు

రిపోర్టర్: సురేష్ స్థలం: Annamayya District

అన్నమయ్య జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నా సీఎం చంద్రబాబు పరిష్కారం చూపకుండా ఆర్భాటపు మాటలతో కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటిలో మీడియాతో మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు అప్పులపాలవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.