దివ్యాంగులకు తీపి కబురు: నేటి నుంచి సదరం స్లాట్ల బుకింగ్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

రాష్ట్రంలో దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు సదరం స్లాట్ల బుకింగ్ను ఈ నెల 2వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి మొత్తం 75 వేల స్లాట్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సచివాలయాలు, వాట్సాప్ మరియు పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, రాష్ట్రవ్యాప్తంగా 117 ఆసుపత్రులలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.