గుర్గావ్ రోడ్డు ప్రమాదం: కారు ఢీకొట్టడంపై స్పందించిన మహిళా బైకర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Haryana
గుర్గావ్లో తన బైక్ను కారు కావాలనే ఢీకొట్టిందంటూ వైరల్ అయిన వీడియోపై మహిళా బైకర్ సియా తీవ్రంగా స్పందించారు. కారు డ్రైవర్ కల్యాణ్ బైస్లా ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఎందుకు ఆపలేదని, తన ప్రాణాలకు హాని జరిగితే బాధ్యత ఎవరిదని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.