ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్ షమ్స్ ములానీ

రిపోర్టర్: మహేష్ స్థలం: పుదుచ్చేరి

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఏ జట్టు బౌలర్ షమ్స్ ములానీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. నాలుగు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. ములానీ విజృంభణతో భారత్ భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. కుమార్ కుశాగ్రా సెంచరీతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.