బ్లింకిట్ అంబులెన్స్ సేవల్ లో కీలక మార్పు: అత్యవసరమైతేనే ఉచితం అంటూ ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

అత్యవసర రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు బ్లింకిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వెల్లడించారు. అత్యవసర రవాణా ఎప్పట్లాగే ఉచితంగా ఉంటుందని, అయితే నాన్-ఎమర్జెన్సీ ట్రిప్పులకు రూ. 2,500 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ఆసుపత్రి సందర్శనల కోసం అంబులెన్స్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకే ఈ కొత్త విధానాన్ని తెచ్చినట్లు ఆయన తెలిపారు.