వైసీపీ ధర్నాలకు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అనుమతులు నిరాకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఎన్టీఆర్

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 21వ తేదీన వైసీపీ తలపెట్టిన ధర్నాలు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. ప్రస్తుతం వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపులు కొనసాగుతుండటం, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.