రాజస్థాన్‌లో వివాహ వేడుకలో అరుదైన ఘటన: వధువుల కోసం హెలికాప్టర్ ఏర్పాటు
రిపోర్టర్: రాము
స్థలం: Rajasthan
రాజస్థాన్‌లోని మేవత్ ప్రాంతంలో రోహిల్ ఖాన్, సాహిర్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు తమ భార్యలైన ఐనా, మౌసినాల కోరిక మేరకు వివాహానంతరం వారిని హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయిదు లక్షల రూపాయల వ్యయంతో ఈ హెలికాప్టర్‌ను నాలుగు గంటల పాటు బుక్ చేసినట్లు వారు వెల్లడించారు. ఈ సరికొత్త ఘటన గ్రామస్థులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.