ఘాట్ రోడ్డులో బోల్తా పడిన ఆటో: తొమ్మిది మందికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: సీతంపేట
సీతంపేట మండలం సవర గొయిది సమీపంలోని ఘాట్ రోడ్డులో శుక్రవారం ఆటో బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయని ఎస్సై వై.అమ్మనరావు తెలిపారు. ఒడిశా నుంచి కోడిశ గ్రామానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. క్షతగాత్రులను 108 వాహనంలో సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించి చికిత్స అందించామని వివరించారు. ఆరు రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.