ఐఐటీ బొంబైకి చెందిన ఆరుగురు అధ్యాపకులకు ఐఎన్‌ఎస్‌ఏ ఫెలోషిప్

రిపోర్టర్: రాజేష్ స్థలం: మహారాష్ట్ర

ఐఐటీ బొంబైకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. కంప్యూటర్ సైన్స్, వాతావరణ మార్పులు, కెమిస్ట్రీ, బయోసైన్సెస్ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రొఫెసర్లు అనిర్బన్ బెనర్జీ, సుప్రతిక్ చక్రవర్తి, సుబిమల్ ఘోష్, దేబబ్రత మైతి, సుపర్ణ ముఖర్జీ, మలయ్ ముకుల్‌లను ఈ పురస్కారం వరించింది. వీరి పరిశోధనలు శాస్త్ర సాంకేతిక రంగాలకు ఎంతగానో దోహదపడనున్నాయి.