నాకు ప్రాణరక్షణ కల్పించండి.. భర్త వేడుకోలు

రిపోర్టర్: సునీల్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా పిఠాపురంలో రోడ్డు ప్రమాదంలో మంచానపడిన భర్తను భార్య చిత్రహింసలకు గురిచేస్తోంది. రోజూ కొడుతూ, అన్నంలో మందు పెట్టి చంపుతానని బెదిరిస్తోందని బాధితుడు శివాజీ వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులను ఆశ్రయించి ప్రాణరక్షణ కల్పించాలని కన్నీటిపర్యంతమయ్యాడు.