జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు విద్యార్థి సాయికుమార్ ఎంపిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వినుకొండ బీసీ గురుకుల విద్యార్థి సాయికుమార్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన ఆయనను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతిలోని సచివాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. గురుకులం ప్రిన్సిపల్ రమేశ్, కోచ్ జునా నాయక్తో కలిసి మంత్రిని కలిసిన సాయికుమార్ను మంత్రి సవిత అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.