రామ్చరణ్, సుకుమార్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మెగా హీరో రామ్చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం తీసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం వెల్లడించింది. రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ ఒకటో తేదీన ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి భాగమైతే తమిళనాడులోనూ భారీ హైప్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.