అల్-ఖైదా భావజాల ప్రచారం: యూపీలో యువకుడు అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా భావజాలాన్ని ప్రచారం చేస్తూ, యువకులను ఆకర్షిస్తున్న 19 ఏళ్ల మహమ్మద్ నబీల్‌ను ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా రహస్య గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద విద్వేష పూరిత సాహిత్యంతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.