యువతకు నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యమంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి యువతకు నైపుణ్యం తప్పనిసరని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. రూ.20 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాణ్ కెరీర్ అండ్ ప్లేస్మెంట్ సెల్ను ఆయన ప్రారంభించారు.