ఎమ్మెల్యేకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ వినోద్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును కొత్తవీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వినోద్ రాయల్, ఆముదాల వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.