భోగాపురం విమానాశ్రయ ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఏరో బస్సుల్లో నెలవారీ పాస్లు జారీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఉద్యోగుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి నడిచే ఏరో ఏసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో నెలవారీ సీజన్ పాస్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. కేవలం పది రోజుల ప్రయాణ ఛార్జీ చెల్లించి ముప్పై రోజుల పాటు ప్రయాణించే వెసులుబాటు కల్పించామని, భోగాపురం కౌంటర్లతో పాటు విశాఖ బస్టాండ్లలో ఈ పాస్లు పొందవచ్చని వెల్లడించారు.