రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి రూ.912 కోట్లతో కేంద్రం చర్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.912.94 కోట్ల భారీ వ్యయంతో విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ మరియు తిరుపతి విమానాశ్రయాల్లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాలు, ఏటీసీ టవర్లు తదితర పనులు దాదాపు పూర్తికాగా, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.