దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలన్న సీఎం రేవంత్
రిపోర్టర్: నరేష్
స్థలం: Yadadri
దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్పత్తికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు సరఫరా కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖతో వెంటనే సమన్వయం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.