ప్లాస్టిక్ వాడకంతో డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

ప్లాస్టిక్ డబ్బాలు మరియు వాటర్ బాటిళ్ల వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ దెబ్బతిని మధుమేహం వచ్చే ప్రమాదం తీవ్రంగా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతున్నాయని ఎస్ఎస్ఏహెచ్ఆర్ అధ్యయనం పేర్కొంది. ఈ విషపూరిత పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని, కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.